గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (21:46 IST)

హైదరాబాద్‌లో ఆటో సర్వీసుల కోసం ONDCతో అనుసంధానమైన రెడ్ బస్

E-auto
ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది రెడ్ బస్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు అద్భుతమైన రవాణా ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న రెడ్ బస్... ఇప్పుడు ONDC (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)తో అనుసంధానమైంది. దీనిద్వారా నగరాల్లోని ఆటోలను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. మొదటిగా రెడ్ బస్... హైదరాబాద్‌లో ఈ ఆటో రిక్షా బుకింగ్ సౌకర్యాలను అందిస్తుంది. తద్వారా నగరంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్లేందుకు ఆటోలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. రెడ్‌బస్ తన ప్రయాణీకులకు మొదటి మరియు చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇది ఒక ప్రధాన అడుగుగా భావిస్తుంది.
 
ఆటో రిక్షా బుకింగ్ సేవలు:
ఇక నుంచి అంటే... 2024 నుంచి హైదరాబాద్ లోని వినియోగదారులు... రెడ్ బస్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆటో రిక్షాలను బుక్ చేసుకోవచ్చు. ONDC APIలతో ఏకీకృతం చేయడం ద్వారా Juspay యొక్క సాంకేతిక సహకారం ద్వారా ఈ సేవలు ఇప్పుడు మరింత సులభతరం కానున్నాయి. రెడ్ బస్ ఆటో రిక్షా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిద్వారా వినియోగదారులు తమకు అవసరమైన ఆటో రిక్షాను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానిక యాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.
 
అంతేకాకుండా ONDC నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం ద్వారా, రెడ్‌ బస్ కొచ్చి, చెన్నైలలో మెట్రో టికెట్ బుకింగ్ సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఇలాంటి వినూత్న ద్వారా, రెడ్‌బస్ సమగ్రమైన గ్రౌండ్ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్స్ ని అందించడానికి, వివిధ రకాల రవాణా మార్గాలను ఏకీకృతం చేయడం ద్వారా ఒక-స్టాప్ పరిష్కారంగా మారింది.
 
"ONDC ద్వారా భారతదేశంలో విభిన్న రకాల రవాణా సౌకర్యాలను అందిస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవల్ని అందించేందుకు వారితో కలిసి పనిచేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ-కామర్స్ నెట్‌వర్క్‌‌ను మరింత సులభతరం చేయడంలో ONDC నిబద్ధతగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే నిబద్ధత కలిగిన సంస్థతో కలిసి డిజిటల్ ఇండియా దిశగా సేవల్ని అందించే కృతనిశ్చయంతో ఉంది రెడ్ బస్. ONDCతో కలిసి, మేము కేవలం మొబిలిటీ సేవలను అందించడం మాత్రమే కాదు... మేము మా వినియోగదారులకు విశ్వసనీయమైన మొదటి మరియు చివరి మైలు ప్రయాణ అనుభవాన్ని అందజేస్తున్నాము. వినియోగదారుల కోసం రవాణఆ ఎంపికలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఎప్పటికప్పుడు సెట్ చేస్తున్నాము” అని అన్నారు రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం.