సంబంధిత వార్తలు
- జియో నుంచి సరికొత్త స్టార్టర్ ప్యాక్- అపరిమిత 5G, క్లౌడ్ స్టోరేజీ- ఫైబర్ ట్రయల్ ఆఫర్
- ఐపీఎల్ క్రికెట్ పండుగ: ఎయిర్ టెల్ నుంచి సూపర్ రూ.451 రీఛార్జ్ ప్లాన్
- జియో నుంచి సూపర్ రీఛార్జ్ ఆఫర్.. రూ.299లకే 2.5GB డేటా, అపరిమిత కాల్స్
- రోజుకు కేవలం 8 రూపాయలే ఖర్చు.. జియో బెస్ట్ రీఛార్జ్.. ఏ వార్షిక ప్లాన్ ఉత్తమం?
- Jio: రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. రోజుకు 2.5 జీబీ డేటా-200 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో రూ.799 రీచార్జ్ ప్లాన్‌ను రద్దు చేసిందా?
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అందుబాటులో ఉన్న రూ.799 రీజార్జ్ ప్లాన్‌ను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ తాజాగా వివరణ ఇచ్చింది. రూ.799 రీచార్జ్ ప్లాన్ రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీచార్జి చేసుకోవచ్చని స్పష్టత నిచ్చింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్‌తో అందుబాటులోనే ఉంచినట్టు వివరణ ఇచ్చింది.
యూజర్లు అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరలో రీచార్జి ప్లాన్‌లను అందించేందుకు కట్టుబడివున్నట్టు జియో పేర్కొంది. రూ.799 ప్లాన్‌తో రీచార్జితో రీచార్జి చేసుకుంటే 84 రోజుల కాలపరిమితి పొందవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్‌లో రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పొందవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
