ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్త: 1100 పోస్టులు ఖాళీ
ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల్ని భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించింది.
ఇందులో 1100 పోస్టులు రెగ్యులర్ కాగా.. 126 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. డిసెంబర్ 29 చివరి తేదీ. 2022 జనవరిలో ఆన్‌టైన్ టెస్ట్ ఉంటుంది.
అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని ఎస్బీఐ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ. 36వేలుగా ఉంటుంది.