శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (20:40 IST)

భారీ స్థాయిలో 'షేర్‌ చాట్‌' పెట్టుబడుల సమీకరణ..

దేశీయ కంటెంట్‌ షేరింగ్‌ యాప్‌ 'షేర్‌ చాట్‌' భారీ స్థాయిలో పెట్టుబడులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌, మూరే స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ సహా మరో సంస్థ నుంచి మొత్తం రూ.1,080 కోట్లు సేకరించింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ మూడు బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగు నెలల క్రితం టైగర్‌ గ్లోబల్‌ స్నాప్‌, ట్విట్టర్‌ సహా మరికొన్ని కంపెనీల నుంచి షేర్‌ చాట్‌ 502 మిలియన్ డాలర్లు సమీకరించింది. 
 
యాప్‌లో ఉపయోగిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని సంస్థ తెలిపింది. తద్వారా మరింత ఫ్రెండ్లీ ఎడిటింగ్‌ టూల్స్‌ను యూజర్లకు చేరువ చేస్తామని ప్రకటించింది. 
 
చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత దేశీయ యాప్‌లైన షేర్‌ చాట్‌, మోజ్‌లకు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. షేర్‌చాట్‌కు 18 కోట్లు, మోజ్‌కు 16 కోట్ల యూజర్లు ఉన్నారు.