గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 జనవరి 2022 (21:11 IST)

ప్రతిభావంతుల నియామకాలను వేగవంతం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, తమ పాల ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న డెలివరీ చైన్‌ కష్టాలను సైతం అధిగమించేందుకు అత్యున్నత ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని నియమించుకునేందుకు దృష్టి సారించింది.

 
ఈ ఫార్మ్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో 23వేల లీటర్ల పాలను సరఫరా చేస్తుండగా, త్వరలోనే  బెంగళూరుతో పాటుగా ఇతర నగరాల్లో కూడా  కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం తమకున్న 300కు పైగా స్టోర్లను 1500కు పైగా వృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకున్న వేళ ప్రతిభావంతుల నియామకంపై దృష్టి సారించింది.

 
ఐఐటీ ఖరగ్‌పూర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ మస్సాచుసెట్స్‌ పూర్వ విద్యార్థి, సిద్స్‌ ఫార్మ్‌ ఎండీ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘నాణ్యమైన పాల ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించాలనే మా ప్రయత్నం విజయవంతమైంది. ఇప్పుడు పాల పరిశ్రమలో నూతన ప్రమాణాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందుకోసం అత్యున్నత ప్రతిభావంతుల నియామకం చేపట్టాలనుకుంటున్నాము. వీరే మా సంస్థను తరువాత దశకు తీసుకువెళ్లగలరు’’ అని అన్నారు.

 
తమ నియామకాలలో భాగంగా సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు ఆరుగురు లీడర్లను మార్కెటింగ్‌, మానవ వనరులు, బ్రాండ్‌ అవగాహన పట్ల దృష్టి సారించిన మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌ విస్తరణ, భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించి నియమించింది. వీరిలో దివ్యదీప్‌ లొల్ల, ఏవీపీ ఆపరేషన్స్‌గా నియమితులు కాగా, ఏవీపీ ఫైనాన్స్‌గా శ్రీ హర్ష వడకట్టు, ఏవీపీ సేల్స్‌గా రాజేష్‌ డేగల, హెచ్‌ జీఎంగా సుజాత రామకోటి , ఏవీపీ మార్కెటింగ్‌ హెడ్‌గా తమల్‌ ఛటర్జీ, ఏవీపీ సేల్స్‌గా గోపి కృష్ణ దారపురాపు ఉన్నారు.

 
‘‘ఇప్పుడు మేము లక్ష్యంగా చేసుకున్న మార్కెట్‌ను ఒడిసిపట్టుకునేందుకు తగిన శక్తిని మేము కలిగి ఉన్నాము. సిద్స్‌ ఫార్మ్‌ సముచిత ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంటుంది. నూరుశాతం హార్మోన్‌ రహిత పాలను మాత్రమే మేము విక్రయిస్తుంటాము. ఇప్పుడు అధికశాతం మంది వినియోగదారులు పాల నాణ్యత ఆవశ్యకత అర్థం చేసుకున్నారు. మా నాయకత్వ బృందం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, కల్తీ లేని పాలు, పాల ఉత్పత్తులను అందరికీ అందించగలదు’’ అని కిశోర్‌ ఇందుకూరి అన్నారు.