మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:53 IST)

ఢిల్లీ - తిరుపతిల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు

దేశ రాజధాని ఢిల్లీ, ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతిల మధ్య నూత‌న విమాన స‌ర్వీసు ప్రారంభ‌మైంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ‌కు చెందిన ఈ స‌ర్వీసును భార‌త‌ పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మొద‌టి స‌ర్వీసు ఆదివారం ఉద‌యం 9.50 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు తిరుప‌తికి చేరుకుంది. 
 
కాగా, విమాన స‌ర్వీసు ప్రారంభం సంద‌ర్భంగా సింధియా మాట్లాడుతూ.. స్పైస్ జెట్ సంస్థ త‌న నూత‌న స‌ర్వీసు ద్వారా దేశ రాజ‌కీయ రాజ‌ధాని ఢిల్లీని ఆధ్యాత్మిక రాజ‌ధాని తిరుప‌తితో క‌లుపుతున్న‌ద‌ని పేర్కొన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ఏటా 3.5 కోట్ల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నార‌ని ఆయన చెప్పారు.