నిమిషానికి 137 బిర్యానీలు.. స్విగ్గీ జాబితాలో బిర్యానీకి 7వ స్థానం
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, భారతీయులు ప్రతి సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ విధంగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను స్విగ్గీ విడుదల చేసింది.
భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారం బిర్యానీ అని ఈ జాబితాలో వెల్లడి అయ్యింది. స్విగ్గీ జాబితాలో బిర్యానీ వరుసగా 7వ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు (సెకనుకు 2.28 బిర్యానీలు) ఆర్డర్ చేయబడతాయని స్విగ్గీ నివేదించింది.
ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటివి నిలిచాయి. దీన్నిబట్టి చూస్తే భారతీయుల్లో బిర్యానీకి ఆదరణ తగ్గలేదు.