గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (20:23 IST)

హైదరాబాదులో ఈ బిర్యానీ గొడవేంట్రా బాబూ...!

Hyderabad Biryani
హైదరాబాదులో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ సీపీని కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీకి ఫోన్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్‌ చేసి ఎన్ని గంటల వరకు హోటల్‌ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగాడు. దీంతో మహమూద్‌ అలీ స్పందిస్తూ తాను హోం మంత్రినని.. వంద టెన్షన్లలలో ఈ ఫోనేంటని అసహనం వ్యక్తం చేశారు.