గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (11:40 IST)

400 రూపాయలకే కిలో మటన్‌- షాపుల వద్ద భారీ బందోబస్తు

సిద్ధిపేట జిల్లాలో మటన్ షాపుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 రూపాయలకే కిలో మటన్‌ విక్రయించారు. దీంతో మాంసం ప్రియులు పెద్దఎత్తున ఎగబడ్డారు.
 
ఆదివారంతో పాటు పెద్దల అమావాస్య కావడంతో వివిధ మండలాల నుంచి భారీగా మాంసం ప్రియలు తరలివచ్చారు. మటన్ తీసుకోవాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
 
ఒకానొక సమయంలో మటన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు నిర్వహించారు.