మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (12:04 IST)

వారణాసి నుంచి ఢిల్లీల మధ్య రెండో బుల్లెట్ ట్రైన్.. 3 గంటల్లోపే చేరుకోవచ్చు..!

ముంబై టు అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. దేశంలో మరో బుల్లెట్ రైలుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ బుల్లెట్ రైలుని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి దేశ రాజధాని ఢిల్లీ మధ్య నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ న‌గ‌రాల మ‌ధ్య దూరం 782 కిలో మీట‌ర్లు కావడంతో ప్రయాణీకులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచే మోడీ లోక్‌సభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారణాసి-ఢిల్లీల మధ్య బుల్లెట్ రైలుని ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు సాధ్యాసాధ్యాలపై స్పానిష్ కంపెనీ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. నవంబరు నాటికి రైల్వే శాఖకు తుది నివేదిక ఇవ్వనుందని సమాచారం.
 
ఈ బుల్లెట్ ట్రెయిన్ అందుబాటులోకి వస్తే అలీగఢ్‌, ఆగ్రా, కాన్పూర్‌, లక్నో, సుల్తానాపూర్‌ల మీదుగా దేశ రాజధానికి చేరుకుంటుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య రెండున్నర గంటల సమయం తగ్గనుంది. ప్రస్తుతం వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే 10 నుంచి 14 గంటల సమయం పడుతోంది.