శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 17 ఫిబ్రవరి 2022 (13:16 IST)

టీసీపీఎల్‌ నుంచి శుద్ధ్‌ బై టాటా సాల్ట్‌ విడుదల

భారతదేశంలో అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) తమ తాజా ఆఫరింగ్‌ ‘శుద్ద్‌ బై టాటా సాల్ట్‌’ను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసింది. శుద్ధ్‌ బై టాటా సాల్ట్‌ అనేది అయోడైజ్డ్‌ సాల్ట్‌ బ్రాండ్‌. ఇది వినియోగదారులకు అత్యంత నాణ్యమైన బ్రాండెడ్‌ ఉప్పును సరసమైన ధరల వద్ద అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఉప్పు త్వరలోనే ఇతర మార్కెట్‌లలోకి అందుబాటులోకి రానుంది.

 
ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో దేశంలోనే అతి తక్కువగా అయోడైజ్డ్‌ ఉప్పును వినియోగిస్తున్నారు. శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ అనేది ప్రాంతీయ బ్రాండ్‌. ఇది ఆధీకృత మరియు అత్యున్నత నాణ్యత కలిగిన అయోడైజ్డ్‌ ప్యాకేజ్డ్‌ ఉప్పును ఈ మార్కెట్‌లలోని వినియోగదారులకు అందిస్తుంది.

 
ఈ నూతన ఆఫరింగ్‌ ఈ మార్కెట్‌లలో అతి తక్కువ అయోడైజ్డ్‌ ఉప్పును వినియోగించడం వల్ల కలిగే సంభావ్య ఆరోగ్య ఆందోళనలను పరిష్కరించడంతో పాటుగా ఒకరి డైట్‌లో అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సైతం వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉప్పు తయారీ ప్రక్రియ అంతటా పలు నాణ్యతా పరీక్షలను ఈ ఉత్పత్తి ఎదుర్కొంటుంది. దీని కారణంగా మురికి, ఇసుక, మలినాలు తొలుగుతాయి. ఇది అత్యున్నత రుచిని అందించడంతో పాటుగా ప్రతి ప్యాకెట్‌ శుద్ధ్‌ బై టాటా సాల్ట్‌ అత్యున్నత నాణ్యత కలిగిన ఉప్పు, ఫ్రీ ఫ్లోయింగ్‌  ఉప్పుగా నిలుస్తుందనే భరోసా లభిస్తుంది.

 
శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ ఆవిష్కరణ గురించి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌  ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌-ఇండియా అధ్యక్షులు దీపక్‌ భాన్‌ మాట్లాడుతూ ‘‘ఉప్పు విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా, భావి మార్కెట్‌ అవసరాలను గుర్తించడంతో పాటుగా సృజనాత్మకంగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. శుద్ద్‌ బై టాటా సాల్ట్‌ను తాము వినియోగించే ఉప్పు నాణ్యత పట్ల అసలు రాజీపడని నిర్ధిష్టమైన విభాగపు వినియోగదారుల అవసరాలను తీర్చే రీతిలో సృష్టించాము. వినియోగదారుల అవసరాలను తీర్చే రీతిలో అత్యున్నత నాణ్యత, సౌకర్యవంతమైన ఉత్పత్తులను అందించాలనే మా నిబద్ధతకు ఈ ఆవిష్కరణ ప్రతిరూపంగా నిలుస్తుంది’’ అని అన్నారు.