శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (20:13 IST)

భారత మార్కెట్లోకి కియా కరెన్స్.. బ్రేకులు వేస్తే బ్యాలెన్స్ తప్పదు

KIA
భారత మార్కెట్లోకి కియా నుంచి కొత్త మోడల్ కారు కరెన్స్ విడుదల అయ్యింది. కియా నుంచి వస్తున్న నాలుగో కారు ఇది. ఇప్పటివరకు కియా భారత్ లో సెల్టోస్, సోనెట్, కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా కియా కరెన్స్‌లో ఫీచర్లకు కొదవలేదు. దాదాపు 10 భద్రతాపరమైన ఏర్పాట్లు కరెన్స్ లోని వివిధ వేరియంట్లలో చూడొచ్చు.
 
ఆల్ వీల్ బ్రేక్స్ ఉండడంతో వేగంగా వెళ్లే సమయంలో బ్రేకులు వేసినా కారు బ్యాలెన్స్ తప్పదు. ప్రతి మోడల్ లోరూ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
 
ఇందులో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.99 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.16.99 లక్షలు. కరెన్స్‌లో క్యాబిన్‌ను విశాలంగా రూపొందించారు. కియా కనెక్ట్ యాప్‌తో అనుసంధానం చేసే వీలున్న ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థను పొందుపరిచారు. 
 
ఇంటీరియర్ ఫీచర్స్
ప్రీమియం లెదర్ సీటింగ్
సన్ రూఫ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, 
కియా ట్రేడ్ మార్క్ టైగర్ నోస్ గ్రిల్ కారు అవుటర్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.
 
వివిధ వేరియంట్లకు అనుగుణంగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్ మిషన్ పొందుపరిచారు.