శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:41 IST)

దేశంలో 30 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ముఖ్యంగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అంతేకాకుండా గత 24 గంటల్లో 347 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 82,817 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 4,17,60,458గా ఉంది.