మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 27 మే 2020 (20:01 IST)

చైనా-అమెరికాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలయిన అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల పునరారంభమయ్యాయి.
 
బంగారం
సోమవారం రోజున, బంగారం ధరలు 1.04 శాతం తగ్గి ఔన్సుకు 1711.2 డాలర్లకు చేరుకున్నాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తరువాత పెట్టుబడిదారులు రిస్క్ సంపదల విభాగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల బంగారం ధరలు పతనమయ్యాయి.
 
అమెరికా మరియు చైనా మధ్య చాలా ముఖ్యమైన వాటాదారుల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోతోంది. అయినప్పటికీ, ఆర్థిక డేటా సురక్షిత స్వర్గధామ సంపద అయిన, బంగారం యొక్క పరిమిత పతనాన్ని సూచిస్తోంది. అనేక దేశాలలో మహమ్మారి కారణంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ సడలించడం అనేది, ప్రపంచ ఆర్థిక స్థితుల పునరుద్ధరణకు ఆశలు రేపింది.
 
వెండి
సోమవారం రోజున, స్పాట్ వెండి ధరలు 0.58 శాతం తగ్గి ఔన్సుకు 17.1 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 0.9 శాతం తగ్గి కిలోకు 47821 రూపాయలకు చేరుకున్నాయి.
 
ముడి చమురు
సోమవారం రోజున, డబ్ల్యుటిఐ ముడిచమురు ధర 3.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 34.4 డాలర్లకు చేరుకుంది. గణనీయమైన చమురు ఉత్పత్తిదారుల ఉత్పాదక కోతల దూకుడు మధ్య ముడి చమురు కోసం ప్రపంచంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలకు మద్దతు లభించింది.
 
ఒపెక్ దాని మిత్రదేశాలు మే 2020 నుండి జూన్ 2020 వరకు తమ ఉత్పత్తి కార్యకలాపాలను రోజుకు 9.7 మిలియన్ బారెల్స్ తగ్గించడానికి అంగీకరించాయి. చమురు ధరలను పెంచడానికి ఈ తగ్గిన ఉత్పత్తి నేపథ్యంలో వారు పనిచేయడం కొనసాగిస్తారా లేదా అని చర్చించడం కోసం, ఒపెక్+ జూన్ 2020 లో మళ్ళీ సమావేశమవుతుంది.
 
కోవిడ్-19 కారణంగా లాక్ డౌన్ ఆంక్షలను తగ్గించడం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. కానీ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో, ముడిచమురు ధరల లాభాలు పరిమితం చేయబడ్డాయి.
 
మూల లోహాలు 
సోమవారం రోజున, ఎల్‌ఎమ్‌ఇ మూల లోహ ధరలు సానుకూలంగా ఉన్నాయి; అయినప్పటికీ, అమెరికా మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం అనే నిరంతర ఆందోళనలతో మార్కెట్ ప్రభావితమైంది. చైనా ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్రణాళికలలో మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం ఉన్న కారణంగా ఇవి పారిశ్రామిక లోహాల డిమాండ్‌ను పెంచడానికి సహాయపడతాయి. మూల లోహాలకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా చైనా దిగుమతి పెరిగింది దీనితో మూల లోహాల ధరలకు మద్దతు లభిస్తోంది, దీనితో చైనా వారు అత్యంత ప్రముఖ లోహ వినియోగారుగా ఉంది.
 
జాతీయ భద్రతా చట్టం ప్రకారం, యుఎస్ ఆంక్షల సమస్యకు హాంకాంగ్ దారితీయబడవచ్చు, ఇది రెండు సూపర్ పవర్ దేశాల మధ్య సంబంధాన్ని మరింత దిగజార్చింది మరియు ఇది మూల లోహాల లాభాలను కూడా పరిమితం చేసింది.
 
రాగి
సోమవారం రోజున, ఎల్‌ఎంఇ రాగి ధరలు 1.4 శాతం పెరిగి టన్నుకు 5362 డాలర్లకు చేరుకున్నాయి. రాగికి డిమాండ్ పెరుగుతుందనే ఆశ ఉన్నందున ప్రముఖ లోహపు ధరలకు చైనా మద్దతు ఇస్తుంది. యుఎస్ మరియు చైనా మధ్య మాంద్యం మరియు సంబంధాలు మరింత దిగజారిపోతాయనే భయం రాబోయే రోజుల్లో రాగి ధరలను ప్రభావితం చేస్తుంది.
 
-ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్