బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (19:40 IST)

విరాట్ కోహ్లీ భార్యకు విడాకులు ఇవ్వాలి.. కిషోర్ గుర్జార్

బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువ. దేశభక్తి విషయంలో కాస్త శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ నోటికి పనిచెప్పారు. ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే సలహా ఇచ్చారు. 
 
అసలు సంగతికి వస్తే.. ఇటీవల అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ''పాతాళ్‌లోక్'' ఓటీటీ ఫ్లాట్ ఫాం అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇందులో కొన్ని అభ్యంతరకరంగా వున్నాయని.. తన అనుమతి లేకుండా ఫోటో వాడారని.. నందకిశోర్ నిర్మాత అనుష్క శర్మపై కేసు పెట్టారు. అలాగే వెబ్ సిరీస్‌ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు. 
 
పోలీసులకు చేసిన ఫిర్యాదులో అనుష్క దేశ ద్రోహి అనే ఆరోపణలు కూడా నంద కిషోర్ చేసారు. తాజాగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉందని… ఆయన భారత్‌ తరఫున ఆడుతున్నారన్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.