శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 27 మే 2020 (19:17 IST)

అభిమాని అడిగిన ప్రశ్నకు కన్నీరు పెట్టుకున్న శృతిహాసన్

శృతి హాసన్ లాక్ డౌన్‌కు ముందు క్రాక్ సినిమాలో నటించించింది. సినిమా చివరి దశలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి లాక్ డౌన్. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇంటికే పరిమితమైన శృతిహాసన్ ఖాళీ సమయాల్లో అభిమానులతో ఇన్‌స్టాగ్రాంలో చాట్ చేస్తోంది.
 
తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్న శృతి హాసన్ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మాత్రం తెగ బాధపడి కన్నీరుపెట్టుకుందట. మేడం.. మీ లవ్ ఫెయిలందట.. అని అడుగగా శృతి ఏడుపు ఆపుకోలేపోయిందట. తన లవ్ ఫెయిలవ్వడం అందరికీ తెలిసిందే.
 
ఆమే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. కానీ ఆ అభిమాని అది తెలిసి అడిగాడో.. లేకుంటే తెలియకుండా అడిగాడో తెలియదు కానీ.. శృతి మాత్రం అతని మాటలకు మనస్సు నొచ్చుకుందట.
 
అయితే ఆ విషయంతో అభిమానులతో మాట్లాడటం శృతి మానేయలేదట. ఇన్‌స్టాగ్రాంలో సందేశాలను పంపుతూ అభిమానులతో టచ్‌లో ఉందట. కొంతమంది అభిమానులు లాక్ డౌన్లో మీరు తిని కూర్చుంటే లావెక్కుతారేమో కదా అని అడిగితే నవ్వుకుని తాను ఇంటిలోనే జిమ్ చేస్తున్నానని.. నీరు ఎక్కువగా తాగుతుంటానని చెప్పుకొచ్చిందట శృతి.