శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2019 (21:46 IST)

ఆ హీరోయిన్ కోసం మహేష్ బాబు సినిమాను ఆపారట.. ఎవరు?

సాధారణంగా ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించాలంటే చాలామంది హీరోయిన్లు ఉత్సాహం చూపుతుంటారు. ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారా అని ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఒక హీరోయిన్ కోసం మహేష్ బాబు సినిమాను పక్కన పెట్టారు. అది కూడా ఏకంగా సంవత్సరం పాటు సినిమా షూటింగ్స్ ను ఆపేశారు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..
 
జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన హీరోయిన్ శృతి హాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా ఈమెకు సొంతంగానే ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిపోవడానికి ఆమే కారణమట. ఎలా అంటే ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉంటూ డేటింగ్ లో బిజీగా ఉంటూ వచ్చారు శృతి హాసన్. చివరకు అది కాస్త బెడిసి కొట్టడంతో ఆమె ఇప్పుడు సినిమాలపైన దృష్టి పెట్టారు.
 
సరిగ్గా సంవత్సరం క్రితం వంశీ పైడిపల్లి ఒక కథను సిద్థం చేశారు. ఆ సినిమాలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శృతి హాసన్ గా నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒకే చెప్పేశారు. ఇక షూటింగ్ ప్రారంభమవ్వడమే ఆలస్యం. వంశీ కథ ఎంతగానో నచ్చడంతో మహేష్ కూడా ఇంట్రస్ట్ చూపించాడట. అయితే ఉన్నట్లుండి శృతి తన ప్రియుడితో బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ కి రానని చెప్పేసిందట. దీంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది.
 
సంవత్సరం గ్యాప్ తరువాత మళ్లీ శృతినే నేరుగా వంశీకి ఫోన్ చేసి షూటింగ్ చేద్దామని చెప్పిందట. దీంతో మళ్ళీ షూటింగ్ కు ప్లాన్ చేసుకుంటున్నారట వంశీ. ఇప్పటివరకు తెలుగు సినీపరిశ్రమలో మహేష్ బాబుతో కలిసి నటించడంతో గ్యాప్ తీసుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క శృతినే అంటున్నారు సినీ విశ్లేషకులు.