షాకింగ్ భార‌తీయుడు 2 ఆగింది..? అందుకే.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్.?

Kamal
శ్రీ| Last Modified శుక్రవారం, 3 మే 2019 (18:28 IST)
జెంటిల్ మేన్, జీన్స్, ప్రేమికుడు, భార‌తీయుడు, రోబో, శివాజీ, 2.0 ఇలా వైవిధ్య‌మైన భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం భార‌తీయుడు 2. ర‌జ‌నీకాంత్‌తో తెర‌కెక్కించిన 2.0 సినిమా రిలీజ్ అయిన వెంట‌నే భారతీయుడు 2 షూటింగ్‌లో స్పీడు పెంచాడు. ఈ మూవీ సెట్స్ పైకి వ‌చ్చింది కానీ.. ఎందుక‌నో ముందుకు వెళ్ల‌డం లేదు.

దీంతో భార‌తీయుడు 2 ఆగిపోయింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. షూటింగ్ జ‌రుగుతుంద‌ని గతంలో క‌మ‌ల్ హాస‌న్ క్లారిటీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ ఆగింది అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ సినిమా ఆగిపోయింది అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ మూవీ ఆగింది కాబ‌ట్టే... ఒక భారీ మల్టీ స్టారర్‌ని ప్రారంభించేందుకు శంక‌ర్ ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం విక్ర‌మ్, విజ‌య్‌ల‌ను శంక‌ర్ సంప్ర‌దించార‌ని తెలిసింది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రానుంద‌ని చెబుతున్నారు. ఇది వాస్త‌వ‌మా..? అవాస్త‌మా..? శంక‌రే చెప్పాలి..!దీనిపై మరింత చదవండి :