శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (21:57 IST)

ఆ రుచి ఎలా వుంటుందో చూడాలని ఉవ్విళ్లూరుతున్న శృతి హాసన్

సినిమాలు చేసింది, సంగీతానికి సానపెట్టింది. కొన్నాళ్ళు హాయిగా లవర్ బాయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దానికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత ఆరోగ్యం పట్ల బోలెడంత శ్రద్థ పెంచేసుకుని మళ్ళీ మేకప్ దిద్దుబాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమై ఉంటుంది. శృతి హాసన్.
 
తెలుగు, తమిళ కథలు ఎడాపెడా వినేస్తున్నా మనస్సుకు వచ్చినవి అంతగా దొరకలేదంటోందట శృతి. మంచి కథలు రావడం లేదని చెబుతూ ఇంకో పక్క కొత్త రంగాన్ని ఎంచుకునే ప్రయత్నాల్లో ఉందట. అందులోను రాజకీయాల వైపు వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేసిందట శృతి.
 
ఇప్పటికే తన తండ్రి కమలహాసన్ తమిళ నీతిమయ్యం పేరుతో ఒక పార్టీని స్థాపించి ప్రజల్లో ఉన్నారు. ఆ పార్టీకి అభ్యర్థులు కాస్త కరువయ్యారు. పెద్దగా జనాదరణ లేకున్న ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలన్నది శృతి ఆలోచన. అందుకే రాజకీయాల వైపు వెళ్ళి ఆ రాజకీయ రుచి ఎలా ఉంటుందో చూడాలన్న నిర్ణయానికి శృతి వచ్చేశారట. త్వరలోనే శృతి హాసన్ రాజకీయ అరగేట్రం చేస్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది.