బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (11:24 IST)

బంగారం ధరలకు కళ్లెం... కాస్త తగ్గింది...

గత వారం రోజులుగా బంగారం ధర చుక్కలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఐతే బుధవారం నాడు బంగారం ధరలకు కాస్త కళ్లెం పడినట్లు కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,700 రూపాయల వద్ద నిలిచింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 30 రూపాయలు మేర తగ్గి 41,000 రూపాయల నుంచి 40,970 రూపాయలకు చేరింది. 
 
దీనితో బంగారు కొనుగోలు చేయాలనుకునేవారు పసిడి వైపు చూస్తున్నారు. వెండి ధరలో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. వెండి కేజీకి నిన్నటి ధర 51,500 రూపాయలు వుండగా అది బుధవారం నాడు 51,350 రూపాయల వద్ద నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.