శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:48 IST)

కరోనా వైరస్ ప్రభావం.. పడిపోతున్న బంగారం ధరలు

పసిడి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే వారు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర తగ్గడానికి పలు కారణాలున్నాయి. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పడిపోవడంతో ఆ ప్రభావం నేరుగానే మన మార్కెట్‌పై కనిపించింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.
 
ఇంకా బంగారు ధరలు పడిపోవడానికి కరోనా వైరస్ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోకుండా ఉండేందుకు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు అమెరికా డాలర్‌తో రూపాయి బలపడుతూ రావడం కూడా పసిడిపై ప్రభావం పడేలా చేసింది.