బంగారం ధరలు పైపైకి... పండగ సీజన్‌లోనూ తగ్గని దూకుడు
దేశంలో బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పండగ సీజన్‌లోనూ ఈ ధరల పెరుగుదలకు ఏమాత్రం బ్రెకులుపడటం లేదు. మంగళవారం కూడా మరోమారు ఈ ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,760గా వద్ద కొనసాగుతోంది. తాజాగా మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,760గా ఉంది.
ఇకపోతే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది.