శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (09:37 IST)

పండగ సీజన్‌లోనూ అదే జోరు : షాకిస్తున్న బంగారం ధరలు

పండగ సీజన్‌లో పసిడి జోరు కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం. పండగ సీజన్‌లో పసిడి అదేజోరు కొనసాగుతోంది. బ్రేకులు వేయకుండా పరుగులు పెడుతోంది. 
 
మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం అభరణాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అన్ని వేళల్లో బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. 
 
పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. 
 
కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా ఎగబాకుతోంది. ఆదివారం కూడా పెరిగిన బంగారం సోమవారం కూడా పెరిగింది. ఇవి సోమవారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు.
 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660గా ఉంది.
 
అలాగే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.