నిలకడలేని బంగారం ధరలు.. మళ్లీ పెరిగాయ్
దేశంలో పండగ సీజన్‌లో బంగారు ఆభరణాల విక్రయాలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో వీటి ధరల్లో ఎక్కడా కూడా నిలకడం కనిపించడం లేదు. శుక్రవారం కూడా బంగారం ధరలు పెరిగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.44, 550కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ.48, 600కి చేరింది.
ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.