సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (17:16 IST)

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి 6 కేజీల బంగారం ఇస్తున్న ఎం.ఇ.ఐ.ఎల్

తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పిలుపు మేరకు దాత‌లు భారీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వేత్త‌లు ఈ పిలుపు అందుకుని బూరి విరాళాలు స‌మ‌ర్పిస్తున్నారు. ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆరు కేజీల బంగారం సమర్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
 
ఈ సందర్భంగా ఎం.ఇ.ఐ.ఎల్  డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో మేం పాలు పంచుకోవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి ముఖ్యమంత్రి ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా మారుతుందని తెలిపారు.