శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (12:11 IST)

పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,455గా ఉంది
 
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. హైదారబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,490గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,860 దొరుకుతోంది. 
 
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,840, ముంబైలో 46,470, న్యూఢిల్లీలో 46,700, కోల్‌కతాలో 46,900, బెంగళూరులో 44,550, కేరళలో 44,500గా ఉన్నాయి.