1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (12:20 IST)

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం (నవంబర్ 11) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 330 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.800 మేర పెరిగి.. 74,000 లుగా కొనసాగుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది. 
 
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,000, విజయవాడలో రూ.77,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా ఉంది.