మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (16:47 IST)

దీపావళి: బంగారం ధరలు తగ్గుముఖం.. వెండి కూడా..

gold
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతోంది. దీంట్లో భాగంగా వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గటం నిజంగా శుభవార్త అనే చెప్పాలి. 
 
బంగారం ధరలు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410లు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గింది. దీంతో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. 
 
మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా తగ్గింది. 
 
ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,690 కాగా, 24 క్యారెట్ల 10గ్రాములు గోల్డ్ రూ. 60,750 వద్దకు చేరింది.