గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (12:49 IST)

వారం రోజులుగా తగ్గుతున్న బంగారం - వెండి ధరలు

gold price
దేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గురువారం నాటి మార్కెట్ లెక్కల ప్రకారం... హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,570గాను, 8 గ్రాముల బంగారం ధర రూ.44,560గా ఉంది. అలాగే, పది గ్రాముల బంగారం ధర రూ.55,700గా ఉంది. బుధవారం ధరలతో పోల్చితే గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.400 మేరకు తగ్గింది. 
 
అలాగే, 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,076గాను, 8 గ్రాముల బంగారం ధర రూ.48,608గా ఉంది. అలాగే, పది గ్రాముల బంగారం ధర రూ.60,760గా ఉంది. గురువారం నాటి ధరలతో పోల్చితే పది గ్రాముల బంగారం ధరపై రూ.440 తగ్గింది. 
 
విజయవాడ నగరంలో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,570గాను, 8 గ్రాముల బంగారం ధర రూ.44,560గాను, అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.55,700గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.400 మేరకు తగ్గింది. అదే 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర  రూ.6,076, 8 గ్రాముల బంగారం ధర రూ.48,608గా ఉంది.