శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (20:29 IST)

నిన్న స్కూటీ.. ఈ రోజు కారులో ఎమ్మెల్సీ కవిత జర్నీ...

kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్నటికి నిన్న స్కూటీపై ప్రయాణించారు. శుక్రవారం స్వయంగా ఆమే కారు డ్రైవ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత మరోసారి వైరల్ అవుతున్నారు.  
 
ఇకపోతే.. గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయటానికి ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలికి ఎమ్మెల్సీ కవిత రావాల్సి ఉంది. కానీ ఆమె కారులో వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 
 
దీంతో కవిత ర్యాలీలో పాల్గొందుకు కారు దిగి స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు.