శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:46 IST)

స్కూటీలో ముగ్గురు యువకులు.. 100 అడుగుల లోయలో పడింది.. చివరికి?

accident
విజయనగరం జిల్లా.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతులు బాలరాజు, జయరాజు, మర్రి శివలు స్కూటీలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోవడంతో తీవ్రగాయాలకు గురైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.