బంగారంపై బాదుడా? అదంతా ట్రాష్, గాలి వార్తలు: స్పష్టం చేసిన కేంద్రం
పరిమితికి మించి బంగారం వుంటే ట్యాక్స్ రూపేణా పన్ను విధిస్తారంటూ నిన్నటి నుంచి వార్తలు వెలువడుతున్నాయి. దీనితో బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. కానీ ఈ వార్తలన్నీ గాలి వార్తలంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు కొట్టి పారేశారు.
బడ్జెట్ రూపకల్పన చేసే సమయంలో ఇలాంటి ఊహాగానాలు సహజమేననీ, వాటిని నమ్మవద్దని తెలియజేశారు. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఇదంతా ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించింది. అసలు తమకు అలాంటి ఆలోచన ఏమీ లేదని కూడా వారు నొక్కి వక్కాణించారు.