సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (16:53 IST)

22న బ్యాంకు సిబ్బంది దేశ వ్యాప్త సమ్మె

ఈ నె 22వ తేదీన బ్యాంకు సిబ్బంది దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారంతో పాటు.. బ్యాంకుల విలీనాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి. 
 
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఈ) నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని వారు వాపోతున్నారు.