శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (22:33 IST)

563 కి.మీ రేంజ్.. ధర రూ. 71 లక్షలు.. కొత్త ఎలక్ట్రిక్ బైక్..

Mika Häkkinen
Mika Häkkinen
వెర్జ్ మోటార్‌ సైకిల్స్, ఫిన్నిష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారీ సంస్థ.. దాని పరిమిత ఎడిషన్ మికా హకినెన్ సిగ్నేచర్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ ఇ-బైక్ యొక్క మొత్తం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దీని ధర 80 వేల యూరోలు, భారత కరెన్సీలో రూ. 71 లక్షల 48 వేలుగా నిర్ణయించారు.
 
వెర్జా మికా హకినెన్ సిగ్నేచర్ ఎడిషన్ మోడల్ వెర్జ్, మికా హకినెన్ మధ్య సహకారాన్ని సూచిస్తుంది. ఇక రెండుసార్లు F1 రేస్ విజేత అయిన మికా హకినెన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. తద్వారా ఈ బైక్ రూపకల్పనలో భాగం అయ్యాడు. 
 
వెర్జ్ మికా హాకినెన్ సిగ్నేచర్ ఎడిషన్ మోడల్ హబ్‌లెస్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది 136.78 హెచ్‌పి పవర్‌ను కలిగివుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.