మోస్ట్ వాంటెండ్ ఆర్థిక నేరగాడిగా విజయ్ మాల్యా
కింగ్ ఫిషర్ అధినేత, బిలియనీర్ విజయ్ మాల్యా ఇపుడు మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు. మాల్యాపై దాఖలైన కేసులో ముంబై కోర్టు శనివారం అవినీతి నిరోధక కోర్టు కొత్త చట్టం ప్రకారం రుణాల ఎగవేత కేసులో తీర్పునిచ్చింది. ఈ తీర్పులో మాల్యాను మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడుగా పేర్కొంది.
దేశంలో ఎస్బీఐతో పాటు.. మరికొన్ని బ్యాంకులకు కలిపి మొత్తం రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. అందువల్ల మాల్యాను మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడుగా ప్రకటించాలని కోర్టును ఈడీ కోరింది.
భారీ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు వెళ్లే వారిని పట్టుకొచ్చేందుకు గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది. ఆర్థిక నేరాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని తయారు చేశారు. వంద కోట్ల కన్నా ఎక్కువ ఆర్థిక నేరానికి పాల్పడి, పరారీలో ఉన్న వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్టు 2018 పేర్కొన్నది.