సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (22:30 IST)

సుస్థిరమైన వ్యవసాయం దిశగా మరో ముందడుగు వేసిన వేకూల్‌

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవసాయ-వాణిజ్య కంపెనీలలో ఒకటైన, వేకూల్‌ ఫుడ్స్‌ ఇప్పుడు మూడు సంవత్సరాల కోసం నేషనల్‌ డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫోరమ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో ఆహార వ్యర్థాలు తగ్గించడంతో పాటుగా స్ధిరంగా సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యంగా తగిన పరిష్కారాలను పరిచయం చేయడం ద్వారా వ్యవసాయ సరఫరా చైన్‌ను పునరావిష్కరించడంలో వేకూల్‌కు సహాయపడుతుంది.
 
వేకూల్‌ యొక్క ఫార్మర్‌ కనెక్ట్‌ మరియు డిస్ట్రిబ్యూషన్‌ ఎక్స్‌లెన్స్‌ ఇప్పడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కోసం, తమ వినూత్నమైన, సుస్థిర వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి సహజసిద్ధంగా అభివృద్ధి చేసిన బయోఫెర్టిలైజర్లను క్షేత్రస్ధాయిలో పరీక్షించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, వేకూల్‌ యొక్క నెట్‌వర్క్‌ సైతం ఈ సుస్ధిర ఆవిష్కరణలు వ్యవసాయ క్షేత్రాలను చేరుకునేందుకు భరోసా కల్పిస్తుంది.
 
ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలను కార్తీక్‌ జయరామన్‌, సీఈవొ, వేకూల్‌ ఫుడ్స్‌ మరియు పద్మశ్రీ డాక్టర్‌ మైల్‌స్వామి అన్నాదురై, ఛైర్మన్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌; పూర్వ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, చంద్రయాన్‌ అండ్‌ మంగల్‌యాన్‌ చేయడంతో పాటుగా పరస్పరమూ వాటిని మార్చుకున్నారు.
 
ఈ సమన్వయం గురించి హెడ్-ఫార్మర్‌ ఎంగేజ్‌మెంట్‌- సెంధిల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను అభివృద్ధి చేసి ప్రోత్సహించడంలో వేకూల్‌ ఎల్లప్పుడూ ముందే ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యం ద్వారా మేము క్షేత్రస్థాయి పరీక్షలకు సహకరించడంతో పాటుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, దాని భాగస్వాములు అభివృద్ధి చేసిన బయో ఫెర్టిలైజర్లను పంపిణీ చేయనున్నాం. మా విస్తృతస్థాయి ‘ఔట్‌గ్రో’ వేదిక మరియు ఎఫ్‌పీఓ నెట్‌వర్క్‌ ద్వారా మేము ఈ ఉత్పత్తుల తయారీలో వినియోగించే ముడి సరుకులను సేకరించనున్నాం. అంతేకాదు, సామర్థ్యంను వృద్ధి చేసుకునేందుకు మేము చేస్తోన్న నిరంతర ఆర్‌ అండ్‌ డీ ప్రయత్నాలకు చోధకంగా కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ యొక్క సాంకేతిక సామర్థ్యం తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
పైన పేర్కొనబడిన అంశాలతో పాటుగా ఈ భాగస్వామ్యం, వేకూల్‌ యొక్క ఆవిష్కరణ బృందం రోబోటిక్స్‌, సెన్సార్స్‌, కృత్రిమ మేథస్సు, మెషీన్‌ లెర్నింగ్‌లో తాజా ఆవిష్కరణలను సైతం వినియోగించుకునే అవకాశం కల్పిస్తూనే రేపటి తరపు వ్యవసాయ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్థ్యమూ శక్తివంతం చేస్తుంది. భారతదేశపు సుప్రసిద్ధ పరిశోధనా సంస్థల నుంచి విప్లవాత్మక పరిశోధనా ఫలితాలను వాణిజ్య అప్లికేషన్‌లను చేరుకునేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అనుమతిస్తుంది.
 
ఈ సందర్భంగా డాక్టర్‌ అన్నాదురై మాట్లాడుతూ, ‘‘నిత్యం పెరుగుతున్న జనాభాతో పాటుగా ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్‌, తరుగుతున్న వనరులు అయినటువంటి సాగు భూమి, మానవ వనరుల క్షీణతకు తోడు వ్యవసాయం కోసం నీటి లభ్యత తగ్గుతుండటం చేత భూమి మొదలు వ్యవసాయ దిగుబడులను విక్రయించేందుకు అవసరమైన సాంకేతిక ఆవిష్కరణలు ఇప్పుడు తక్షణావసరం.
 
వేకూల్‌తో చేతులు కలపడం ద్వారా ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటుగా దాని సంబంధిత భాగస్వాములు ఇప్పుడు  అవసరమైన ఆవిష్కరణలను అందుబాటు ధరలలో సంపూర్ణమైన పరిష్కారాలను సుస్థిర వ్యవసాయం దిశగా ఆహార గొలుసుకట్టులో తగిన విలువను జోడిస్తూ తీసుకురావడం సాధ్యమవుతుంది. రైతుల నుంచి వినియోగదారుల వరకూ వాటాదారులందరికీ ఈ భాగస్వామ్యం ప్రయోజనం కలిగించనుంది’’ అని అన్నారు.
 
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐఐహెచ్‌ఆర్‌), ఐఐటీ-హైదరాబాద్‌ మరియు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) వంటి ఇనిస్టిట్యూట్‌తో దీర్ఘకాలపు భాగస్వామ్యాలను చేసుకోవడంపై వేకూల్‌ పెట్టుబడి పెట్టడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించడం, మొత్తం ఆహార సరఫరా మార్గంలో సుస్థిరతను తీసుకురావడంను తమ దీర్ఘకాలపు సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా చేస్తుంది. వేకూల్‌ ఇప్పుడు నేరుగా సేకరించిన తమ విస్తృత శ్రేణి తాజా దిగుబడులను పంపిణీ చేయడంతో పాటుగా శుద్ధ, ధాన్య, కిచెన్‌జీ, లాఎక్సోటిక్‌, మధురం మరియు ఫ్రెషీస్‌ వంటి బ్రాండ్ల నుంచి స్టేపుల్స్‌ను సైతం దాదాపు 20 వేల వాణిజ్య ఔట్‌లెట్లు, సంస్థాగత ఖాతాదారులకు సరఫరా చేస్తుంది.