సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (18:36 IST)

14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో భారీ ఉద్యోగావకాశాలు

14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4336 ఉద్యోగ స్థానాల్ని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి 14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4336 స్థానాలను భర్తీ చేయాల్సి వుందని ఐబీపీఎస్ ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఐబీపీఎస్ తెలిపింది. 
 
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. ఏదేనీ యూజీ డిగ్రీ పూర్తి చేసివుండాలి. 
ఖాళీలు 
అలహాబాద్ బ్యాంక్-400 
బ్యాంక్ ఆఫ్ బరోడా -899 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర -350 
కెనరా బ్యాంక్ -500 
కార్పొరేషన్ బ్యాంక్ -150 
ఇండియన్ బ్యాంక్ -439
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ -300 
యూకే బ్యాంక్ - 500 
యూనియన్ బ్యాంక్ ఆఫర్ ఇండియా -644 
 
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?  
అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఐబీపీఎస్‌డాట్ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
అదనపు వివరాలకు https://www.ibps.in/wp-content/uploads/CRP_PO_MT_IX.pdf  లింకును ఉపయోగించుకోవచ్చు. 
దరఖాస్తుకు చివరి తేదీ -28.08.2019
తొలివిడత పరీక్షలు - అక్టోబర్ 12, 13, 19, 20 తేదీల్లో జరుగుతాయి. 
మెయిన్ పరీక్షలు -30.11.2019 
ఇంటర్వ్యూ : జనవరి 2020