మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:50 IST)

12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుజ్జీవం...

ఆర్థిక నేరస్తుల మోసాలకు బలైపోయిన బ్యాంకులకు పునరుజ్జీవం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. భారతదేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అందించడానికి భారత ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ రీక్యాపిటలైజేషన్ మొత్తం రూ. 48,239 కోట్ల రూపాయలుగా ఉండనుంది.
 
భారతదేశంలో బ్యాంకుల నుండి అప్పు తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా నష్టపోయిన 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ ప్రక్రియకు ఈరోజు ఆమోద ముద్ర పడింది. ఇందులో అత్యధిక మొత్తం కార్పొరేషన్ బ్యాంకుకు కేటాయించగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అత్యల్ప మొత్తం కేటాయించబడింది.
 
కేటాయింపుల వారీగా కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 9,086 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ. 6,896 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 5,908 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 4,638 కోట్లు, యూనియన్ బ్యాంకుకు రూ. 4,112 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ. 3,806 కోట్లు, యూకో బ్యాంకుకు రూ. 3,330 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ. 3,256 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2,560 కోట్లు, సిండికేట్ బ్యాంకుకు రూ. 1,603 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 205 కోట్లు కేటాయించబడ్డాయి.