శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:23 IST)

కాగ్ అలా షాకిచ్చింది.. మోదీ సర్కార్ డీలే బెస్ట్ అని చెప్పేసింది..

రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభకు ముందు వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారికి ఈ నివేదికలో కాగ్ కీలక విషయాలను వెల్లడించింది. 126 యుద్ధ విమానాల కోసం గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ కంటే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందమే బెస్ట్ అని కాగ్ తెలిపింది. 
 
మోదీ సర్కారు 36 విమానాల కోసం చేసుకున్న ఈ ఒప్పందం 2.8 శాతం చీప్ అని పేర్కొంది. కానీ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విమానాల ధరను మాత్రం నివేదికలో కాగ్ పేర్కొనలేదు. ధరలను బహిరంగపరిచకూడదని.. రక్షణ శాఖ భావించడమే ఇందుకు కారణం. 
 
రాఫెల్ యుద్ధ విమానాలలో 13 కీలకమైన మార్పులను భారత్ కోరిందని.. ప్రస్తుత దేశ రక్షణకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని... యుద్ధ విమానాల ఆధునీకరణకు అయిన ఖర్చు కొత్త ఒప్పందంతో చాలా తగ్గిందని కాగ్ తెలిపింది. గత ఒప్పందం కంటే 5 నెలల ముందే 18 విమానాలు భారత్ కు రానున్నాయని చెప్పింది.