ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 మార్చి 2023 (22:42 IST)

బ్రిటిష్ కౌన్సిల్ 2023-24 సంవత్సరానికి స్టెమ్ ఉపకార వేతనాల ప్రకటన

students
విద్యావకాశాలు, సాంస్కృతిక సంబంధాల కొరకు యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క అంతర్జాతీయ సంస్థ అయిన బ్రిటిష్ కౌన్సిల్, స్టెమ్‌లో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ ఉపకారవేతనాల మూడవ సమిష్టి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇండియా, ఇతర దక్షిణాసియా దేశాల నుండి మహిళా స్టెమ్ స్కాలర్లకు 26 ఉపకార వేతనాలు మరియు ఫెలోషిప్స్ రిజర్వు చేయబడ్డాయి. దేశ-నిర్దిష్ట యోగ్యత లేకుండానే ప్రతిభా ప్రాతిపదికన ప్రదానం చేయబడ్డాయి. ఇవి 6 యుకె ఉన్నత విద్యా సంస్థల వ్యాప్తంగా ఉన్నాయి. అవి - కోవెంట్రీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్. ఎంపిక చేయబడిన మహిళా స్కాలర్లు స్టెమ్‌లో తమ కెరీర్లను పెంపొందించుకోవడానికి, యుకె యొక్క సుప్రసిద్ధ స్టెమ్ రంగాలలో ప్రావీణ్యతను సాధించడం ద్వారా తమ స్వదేశములో పరిశోధన- వినూత్న ఆవిష్కారాలను ప్రోత్సహించడానికి ఈ ఉపకారవేతనాలు సహాయపడతాయి.
 
ఇండియా నుండి ఎంపిక చేయబడిన స్కాలర్లు ఒక యుకె యూనివర్సిటీలో ఒక మాస్టర్స్ డిగ్రీని లేదా తొలి విద్యావిషయక ఫెలోషిప్ పొందగలిగి ఉంటారు, మరియు ఉపకారవేతనములో ట్యూషన్ ఫీజు, స్టైపెండ్, ప్రయాణ ఖర్చులు, వీసా, ఆరోగ్య వర్తింపు ఫీజులు, తల్లులకు ప్రత్యేక మద్దతు మరియు ఇంగ్లీష్ భాషా మద్దతు చేరి ఉంటాయి. స్కాలర్లు పూర్వవిద్యార్థుల నెట్‌వర్క్ యందు క్రియాశీలక నిమగ్నత ద్వారా యుకె తో సంబంధం ఏర్పరచుకోవడానికి మరియు తర్వాతి తరం మహిళలకు స్టెమ్‌లో స్ఫూర్తిని కలిగించడానికి గాను సుదీర్ఘ- కాలం నిలిచి ఉండే ఒక వేదికను కూడా ఈ ఉపకారవేతనాలు అందజేస్తాయి.
 
2021/22 వ్యాప్తంగా 115 మంది ప్రపంచ సమిష్టి స్కాలర్లు 2021 శరదృతువు కాలవ్యవధిలో తాము ఎంచుకున్న కోర్సులో నమోదు చేసుకున్నారు. 2022-23 లో 21 మంది భారతీయ మహిళలు ఉపకారవేతనాలు అందుకున్నారు మరి ప్రస్తుతం యుకె లో చదువుకుంటున్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ఈ ఉపకారవేతనాలతో, యుకె లోని ఒక యూనివర్సిటీలో స్టెమ్ (STEM) (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా గణితం) లో ప్రపంచస్థాయి సాధనలను పొందడానికి ఎదురుచూస్తున్న మహిళలకు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తుంది.
 
 
బ్రిటిష్ కౌన్సిల్, ఇండియా, విద్యా నిర్దేశకులు రితికా చంద్ర పారూక్ గారు ఇలా అన్నారు, “బ్రిటిష్ కౌన్సిల్ వద్ద మేము, మహిళల యొక్క ప్రాప్యత పెరుగుదల ద్వారా శాస్త్రీయ మరియు సాంకేతిక రంగాలు మరెంతగానో పురోగతి సాధిస్తాయని నమ్ముతున్నాము. ఈ రంగాలను మరింత సమృద్ధిదాయకంగా మరియు మరింత ఉత్పత్తిదాయకంగా చేస్తూ ఈ ఉపకారవేతనాలు ప్రతిభావంతులైన మహిళల అద్భుతమైన సృజనాత్మకత, వినూత్నత మరియు విశిష్ట ధృక్పథాలను వెలికి తీస్తాయి.

యుకె యొక్క సుప్రసిద్ధి చెందిన పరిశోధన బోధనా శాస్త్రము, అత్యాధునిక సదుపాయాలు మరియు నిత్యనూతన సాంకేతికతకు ప్రాప్యతను పంచుకోవడం ద్వారా మరింతమంది మహిళలు స్టెమ్ రంగాలలో కెరీర్ దిశగా తమ ప్రయాణంపై బయలుదేరడానికి వీలు కల్పించడం పట్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నాము, అవి వారి అభ్యసనాన్ని పరివర్తన చేయగలవు మరియు వారి అవకాశాల ఉద్భవాన్ని విస్తృతం చేయగలవు. గత కొద్ది సంవత్సరాలుగా, 200కు పైగా భారతీయ మహిళలు ప్రపంచ అగ్రగామి విద్యను ప్రాప్యత చేసుకోవడానికి మరియు వారి అంతిమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి మేము మద్దతునిచ్చాము, మరియు మహిళలు మెరుగైన రేపును తీర్చిదిద్దుకోవడానికి మరియు ఆ ప్రక్రియలో ఇతరులకు స్ఫూర్తి కలిగించడానికి మరింత మద్దతు జోడింపును కొనసాగించే లక్ష్యముతో ఉన్నాము” అన్నారు.