గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (14:49 IST)

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్ : ఎంసెట్ - పీజీఈసెట్ షెడ్యూల్స్ వెల్లడి

written test
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అలెర్ట్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎంసెట్, పీజీఈసెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్స్ శుక్రవారం ప్రకటించారు. దీని ప్రకారం మే 7వ తేదీన ఎంసెట్, మే 29వ తేదీన పీజీఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండింటికీ ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
ఈ యేడాది ఎంసెట్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 28వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మార్చి 3 దరఖాస్తులను స్వీకరిస్తారు. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. 
 
అదేవిధంగా పీజీఈసెట్ షెడ్యూల్‌ను ఈ నెల 28వ తేదీన విడుదల చేసిన మార్చి 3 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు దరఖాస్తులు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. లేట్ ఫీజుతో మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
రూ.250 లేట్ ఫీజుతో మే 5వ తేదీ వరకు, రూ.500 ఫీజుతో మే 10వ తేదీ వరకు, రూ.2500 ఫీజుతో మే 15వ తేదీ వరకు, రూ.5 వేలుతో మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. మే 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 29వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రాతపరీక్షను నిర్వహిస్తారు.