శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:01 IST)

2023-24లో ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైస్స్‌

image
హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైస్స్‌ (HITS) తమ ఆన్‌లైన్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష HITSEEE 2023 మరియు లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ అప్లయ్డ్‌ సైన్స్‌, స్కూల్‌ ఆఫ్‌ లా మరియు ఇతర ప్రోగ్రామ్‌ల కోసం పరీక్ష- HITSCAT 2023 కోసం తేదీలను వెల్లడించింది. ఈ సందర్భంగా హెచ్‌ఐటీఎస్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఎన్‌ శ్రీధర మాట్లాడుతూ ‘‘ రాబోయే విద్యాసంవత్సరం కోసం HITSEEE 2023 పరీక్షలు మే 03 నుంచి 10వ తేదీ వరకూ జరిగితే HITSCAT ఆన్‌లైన్‌ పరీక్ష  17 మే 2023 నుంచి 18 మే 2023 వరకూ జరుగుతాయి. HITSEEE 2023 పరీక్షల కోసం దరఖాస్తులను పంపడానికి ఆఖరు తేదీ 30 ఏప్రిల్‌ 2023 కాగా,  HITSCAT 2023 కోసం ఆఖరు తేదీ 14 మే 2023. పరీక్షలలో మెరుగైన ప్రతిభను కనబరిచిన విద్యార్థులు 100% స్కాలర్‌షిప్‌లను పొందవచ్చు’’ అని అన్నారు.
 
హెచ్‌ఐటీఎస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకోబ్‌ వర్గీసీ మాట్లాడుతూ, ‘‘గత కొద్ది సంవత్సరాలుగా మా ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా, మేము తాజా ఇండస్ట్రీ డెవలప్‌మెంట్స్‌ను కోర్సు కరిక్యులమ్‌లో భాగంగా అందిస్తున్నాము. ఇస్రో, డీఆర్‌డీఓలతో కలిసి శాటిలైట్‌ టెక్రాలజీ, అండర్‌ వాటర్‌ రోబోటిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ  సహకారంతో ప్రోగ్రామ్‌లను ప్రారంభించాము. ఇవన్నీ ఇండస్ట్రీరెడీ విద్యా కార్యక్రమాల పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
 
హెచ్‌ ఐటీఎస్‌ ప్రో ఛాన్స్‌లర్‌ అశోక్‌ వర్గీసీ మాట్లాడుతూ ‘‘విద్యార్థులకు సమగ్రమైన విద్యనందించడంపై హెచ్‌ఐటీఎస్‌ దృష్టి సారించింది. అధిక శాతం ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌లను ఎన్‌బీఏ అక్రిడియేట్‌ చేసింది. హెచ్‌ఐటీఎస్‌ దాదాపు 100 ప్రోగ్రామ్‌లను అందిస్తుంది’’ అని అన్నారు.