శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (13:44 IST)

ఐపీఎల్ 16వ సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం.. నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ

Dhoni
ఐపీఎల్ 16వ సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు ట్రోఫీని గెలుచుకోగా, ఇప్పటివరకు 4 సార్లు ట్రోఫీని గెలుచుకున్న సీఎస్‌కే 5వ సారి ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. 
 
అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్, 2 సీజన్‌లు మినహా మిగిలిన అన్నింటిలోనూ ప్లేఆఫ్‌లకు చేరుకుంది. అందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రధాన కారణం.
 
ఐపీఎల్‌లో 234 మ్యాచ్‌ల్లో 4978 పరుగులు చేసిన ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడతానని హామీ ఇచ్చాడు. 
 
ఈ ఏడాది ఐపీఎల్ భారత్‌లో జరుగుతున్నందున, భారత గడ్డపై ఐపీఎల్ ట్రోఫీని 5వ సారి గెలుచుకున్న తర్వాత ధోని రిటైర్మెంట్ తీసుకోనున్నందున ఇది అతని చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చునని క్రీడా పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ తీవ్రంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.