గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (10:45 IST)

జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అప్లై చేసుకోవచ్చు..

జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 6, 2017 నుంచి ఏప్రిల్ 06, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా 2510 పోస్టులుంటాయి. ఈ ప

జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 6, 2017 నుంచి ఏప్రిల్ 06, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా 2510 పోస్టులుంటాయి. ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు.. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన టెలికాం, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, గేట్-2017 పరీక్ష రాసి ఉండాలి.
 
పే స్కేల్ నెల రూ.16400-రూ.40500/ వరకు ఉంటుంది. జనవరి 31,2017వరకు అభ్యర్థుల వయసు 18-30సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు రుసుం: ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.300/, ఆన్ లైన్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.