సోమవారం, 26 జనవరి 2026
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 జూన్ 2015 (12:51 IST)

ఎంబీబీఎస్‌లో కొత్త పద్ధతి: ఎగ్జిట్ ఎగ్జామ్ కోసం మోడీ సర్కార్ ప్లాన్

ఎంబీబీఎస్ విద్యలో కొత్త పద్ధతికి నరేంద్ర మోడీ సర్కారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన తర్వాత జూనియర్ డాక్టర్లు, పూర్తి స్థాయి డాక్టర్లుగా మారి ప్రాక్టీసును ప్రారంభించాలంటే వారిలోని క్వాలిటీని నిరూపించుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గవర్నమెంట్, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న మెడికల్ విద్యార్థులకు 'ఎగ్జిట్ ఎగ్జామ్' నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
క్వాలిటీతో నిండిన పూర్తి స్థాయి వైద్యులే సేవలందించాలన్న లక్ష్యంతోనే ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన డాక్టర్లతో 'ఆల్ ఇండియా చాప్టర్'ను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం విద్యాభాస్యం పూర్తి చేసుకున్న డాక్టర్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వారంతట వారే రిజిస్టర్ చేసుకుంటున్నారు. 
 
వీరంతా మరో రాష్ట్రంలో ప్రాక్టీసు చేయాలని భావించిన పక్షంలో రిజిస్ట్రేషన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాల్సి వుంటుంది. ఎగ్జిట్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడైనా ప్రాక్టీసు నిర్వహించుకోవచ్చు. ఈ పరీక్షలో విఫలమైన వారు పీజీ విద్యను కొనసాగించ లేరు. ఈ ముసాయిదా ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించాల్సి వుంది. మరి ముసాయిదాకు ఆమోదం లభిస్తుందో లేదో వేచి చూడాలి.