శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (14:27 IST)

27 తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు

exam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు ఈ నెల 27వ తేదీ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 15వ తేదీన టెట్ రాత పరీక్షను నిర్వహించారు. ఇందులో పేపర్-1 పరీక్షకు 2.26 లక్షల మంది, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు. అయితే, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్టీ వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఈ నెల 27న జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని టీఎస్పీఎస్సీ కోరింది.
 
ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్సైట్ https://ctet.nic.in సూచించింది.