బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (11:00 IST)

తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు...

rain
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్ర వైపు వీస్తున్న తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
తేమ గాలుల ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికం. ఖమ్మంలో 2.2 డిగ్రీలు అధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
 
రాజస్థాన్‌లో వింత - 26 వేళ్ళతో పుట్టిన ఆడబిడ్డ  
 
సాధారణంగా మనుషులకు ఆరు వేళ్లు ఉంటే అదృష్టమని అంటుంటారు. కానీ, ఓ ఆడబిడ్డ ఏకంగా 26 వేళ్లతో పుట్టింది. ఈ అసాధారణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. దీంతో ఆ బిడ్డ తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు సైతం ఆ శిశువును అమ్మవారి అవతారంగా భావిస్తూ మురిసిపోతున్నారు. దేవతామూర్తే తమ ఇంట కాలిడిందంటూ తమ అదృష్టాన్ని తలచుకుంటు సంబరపడిపోతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని భర్త‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సర్దూదేవి అనే మహిళ ఇటీవలే పడంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అసాధారణ రీతిలో శిశువు ఒక్కో చేయికి ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 వేళ్లతో జన్మించింది. అది మినహా బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో ఆ కుటుంబం శిశువును ధోలాఘడ్ దేవి అమ్మవారి అవతారంగా భావిస్తోంది. 
 
'నా చెల్లి 26 వేళ్లున్న బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అమ్మవారి అంశతో పుట్టిందని మేము బలంగా నమ్ముతున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం' అని శిశువు మేనమామ మీడియాకు తెలిపారు. బిడ్డ తండ్రి గోపాల్ భట్టాచార్య సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం శిశువు జన్యుక్రమంలో మార్పులే అదనపు వేళ్లకు కారణమని నమ్ముతారు. అన్ని వేళ్లు ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇది అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.