ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగావకాశాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Last Updated: సోమవారం, 10 డిశెంబరు 2018 (13:34 IST)
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానింపబడుతున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్, (హైదరాబాద్) 2019-20 విద్యా సంవత్సరానికి గానూ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
 
మొత్తం 39 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఏపీగోల్కొండ.ఈడీయూ.ఇన్/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అర్హత.. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, ఎడ్యుకేషన్‌లో డిగ్రీ సీటెట్/టెట్ అర్హత 
పోస్టులు.. పీజీటీ టీజీటీ, పీఆర్టీ, పీటీఐ, స్పెషల్ ఎడ్యుకేటర్, యోగా టీచర్, డ్యాన్స్ టీచర్.
చివరి తేదీ.. డిసెంబర్ 31 
అప్లికేషన్ ధర.. రూ.100
 
https://apsgolconda.edu.in అనే వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో వివరాలను పూర్తిచేసి.. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్, అనే చిరునామాకు పంపాలి. లేకుంటే ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. దీనిపై మరింత చదవండి :