గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:56 IST)

స్నేహితుడిని చంపి శవంతో సెల్ఫీ... వాట్సప్‌లో షేర్...

గంజాయి దమ్ము బిగించి కొడితే... అనే పాటలో మాదిరిగా ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థం గంజాయి మత్తులో కొట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకడు రాక్షసుడిగా మారిపోయి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా మద్యం సీసాతో గొంత కోసి ఆ తర్వాత పొడిచేశాడు. ఇంకా కసి తీరక అతడి ముఖాన్ని ఛిద్రం చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో సెల్ఫీ దిగి తన మిగిలిన స్నేహితులకు షేర్ చేసేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ పోలీసు స్టేషనుకి కూత వేటు దూరంలో ముగ్గురు యువకులు గంజాయి సేవించారు. ఈ క్రమంలో ఏదో విషయం దగ్గర కార్తీక్, కుబేష్ మధ్య వాదన జరిగింది. అసలే గంజాయి మత్తులో వుండటంతో అతడు మరింత ఆగ్రహావేశానికి గురై దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడి శవంతో కార్తీక్ సెల్ఫీ దిగి శవాన్ని అక్కడో గోతిలో పూడ్చి పెట్టేశాడు. ఇతడికి మరో స్నేహితుడు కూడా సాయం చేశాడు. 
 
ఐతే వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి వచ్చేటపుడు ఇద్దరే రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో గొయ్యి తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అక్కడ తవ్వి చూడగా యువకుడి శవం లభించింది. మరోవైపు వాట్సప్‌లో షేర్ అయిన ఫోటోలు కూడా పోలీసుల దృష్టికి రావడంతో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.