బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (14:55 IST)

చెన్నైలో దారుణం : మిట్టమధ్యాహ్నం... వేటకొడవళ్లు, కత్తులతో న్యాయవాది హత్య

ప్రశాంత వాతావరణానికి నిలయమైన చెన్నై నగరంలో పట్టపగలు, మిట్టమధ్యాహ్నం ఓ దారుణ హత్య జరిగింది. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న 32 యేళ్ల వ్యక్తిని వేటకొడవళ్లు, కత్తులు తదితర మరణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ఆ లాయర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హంతకులు మెరుపు వేగంతో పారిపోయారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చెన్నై నగర శివారు ప్రాంతమైన పుళల్‌, కావాక్కరై శంకరలింగనార్‌ వీధికి చెందిన అఖిలన్ అలియాస్‌ అఖిల్‌నాథ్‌ (32) మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ నేతగా కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అఖిలన్ తన ఇంటి వద్దకు నడచి వెళుతుండగా మూడు మోటార్‌బైకులలో వచ్చిన ఆరుగురు దుండగులు చుట్టుముట్టి కత్తులు, వేటకొడవళ్ళు తదితర మారణాయుధాలతో దాడి జరిపారు. 
 
అఖిలన్ రక్తపుమడుగులో పడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అఖిలన్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే ఆ దుండగులు బైకుల్లో మెరుపువేగంతో అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, ఈ హత్యలో న్యాయవాద వృత్తిలో ఉండే కొందరు ప్రత్యర్థులకు భా*.txtగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.